రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవం..: టీఎస్ గవర్నర్ తమిళిసై

రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు.తాను ఎటువంటి ఎంపీ టికెట్ అడగలేదని తెలిపారు.

అలాగే పార్టీ హైకమాండ్ ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే పోటీ గురించి తాను ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని చెప్పారు.

అలాగే తూత్తుకుడి కార్యక్రమంలో పాల్గొనేందుకే ఢిల్లీ వెళ్లానని తెలిపారు.తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని వెల్లడించారు.

అయితే గవర్నర్ తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారని .సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు