మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్‌ ను తీసుకొచ్చిన రిలయన్స్ జియో..!

ఆండ్రాయిడ్ యూజర్లకు రిలయన్స్ జియో సంస్థ వార్తను తీసుకువచ్చింది.తాజాగా రిలయన్స్ జియో మేడ్ ఇన్ ఇండియా బ్రౌజర్ ను విడుదల చేసింది.

ఇందులో డేటా ప్రైవసీతో పాటు యూజర్ల సమాచారాన్ని పూర్తిగా వారి కంట్రోల్ లో ఉండేలా అత్యాధునిక ఫీచర్స్ ను ఈ బ్రౌజర్ లో రూపొందించింది జియో సంస్థ.జియో పేజెస్ అనే పేరుతో ఈ వెబ్ బ్రౌజర్ ను రూపొందించింది.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.నూతన బ్రౌజర్ లో పేజ్ లను వేగంగా లోడ్ చేయడం, సమర్థవంతంగా మీడియా స్ట్రీమింగ్ చేయడం అలాగే ఎన్క్రిప్ట్ కనెక్షన్ లాంటి ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

అంతేకాదు పర్సనలైజ్డ్ హోమ్ స్క్రీన్ ఆప్షన్ ని కూడా యూజర్ కి తీసుకు వచ్చారు.ఈ బ్రౌజర్ ను ఎవరైనా సరే గూగుల్, బింగ్, యాహూ మొదలగు లాంటి వాటిని తమకు నచ్చిన సెర్చ్ ఇంజన్ల ను డిఫాల్ట్ గా వాడుకోవచ్చు.

Advertisement

ఇక ఇందులో డౌన్లోడ్ మేనేజర్ కూడా చాలా ఆకర్షణీయంగా తీసుకువచ్చారు.ఇందులో ఏవైనా ఇమేజెస్, డాక్యుమెంట్స్, వీడియో, వెబ్ పేజి లాంటివి వేరువేరుగా వివిధ కేటగిరీలలో చూపిస్తుంది.

కాబట్టి మీరు ఎలాంటి ఫైల్ వెతకాలి అనుకుంటున్నారో డైరెక్టుగా అందులోకి వెళ్లి వెతకడం చాలా సింపుల్ గా మారిపోతుంది.ఇది ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే.

ప్రాంతీయ భాష అయిన తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠి, గుజరాతి, మలయాళం, బెంగాలీ తో పాటు హిందీ భాషలను జియో బ్రౌజర్ సపోర్ట్ చేయనున్నది.వీటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యూజర్లు వారి భాష కు సంబంధించి.

ప్రాంతానికి సంబంధించిన కంటెంట్ ను కూడా పొందవచ్చు.మీరు ఎంచుకున్న భాష కు సంబంధించి జియో పేజెస్ నోటిఫికేషన్లను కూడా పంపుతుంది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఒన్స్ మోర్ నీరజ్ చోప్రా.. మళ్లీ గోల్డ్ కొట్టేనా.? ఒలంపిక్స్ లో నేటి భారత్ ఈవెంట్స్ ఇవే..

ఇందులో ట్రెండింగ్ లో ఉన్న సమాచారాన్ని మనం పొందవచ్చు.ఇందులో ప్రధానంగా యూజర్ల ప్రైవేట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తూ జియో పేజెస్ వెబ్ బ్రౌజర్ ని తయారుచేసింది రిలయన్స్ జియో సంస్థ.

Advertisement

ఇందులో ఇగ్నోసెంట్ మోడ్ కూడా ఇవ్వడంతో సెక్యూరిటీ పరంగా ఎన్నో లాభాలను పొందవచ్చు.ఇందుకోసం ప్లే స్టోర్ ఓపెన్ చేసి జియో పేజెస్ అని టైప్ చేస్తే అందుకు సంబంధించి యాప్ కనపడుతుంది.

తాజా వార్తలు