Dharani : ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదల

తెలంగాణలో ధరణి( Dharani ) సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలను( CCLA Guidelines ) జారీ చేసింది.

 Release Of Guidelines For Solving Dharani Problems-TeluguStop.com

ఇందులో భాగంగా మార్చి ఒకటి నుంచి వారం రోజుల పాటు ధరణి సమస్యలు పరిష్కారానికి తెలంగాణ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నారు.ధరణి అప్లికేషన్లను వెంటనే క్రియర్ చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అందుకు అనుగుణంగా ధరణి కమిటీ( Dharani Committee ) కొన్ని సూచనలు చేసింది.తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు నడవనున్నాయి.కాగా ఒక టైం లైన్ విధించి పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచాలని సూచించింది.

ధరణిని అడ్డం పెట్టుకొని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube