ఖైదీనం.150 రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీనం.150 షూటింగ్ చివరి దశల్లో ఉంది.వచ్చే నెలలో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరత్వరగా పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను బాక్సాఫీస్ బరిలో దింపనున్నారు.ఇక్కడివరకు మీకు తెలిసిన విషయాలే.

ఇక కొత్త వార్త ఏమిటంటే, ఈ చిత్రం ముందు చెప్పినట్లుగా జనవరి 13కి రావట్లేదు.అవును, రిలీజ్ డేట్ లో చిన్న తేడా! ఖైదీనం.150 ప్రపంచవ్యాప్తంగా జనవరి 11వ తేదిన విడుదల కాబోతోంది.ఈ వార్తలో పెద్దగా మార్పులుండవు.

త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తారు దర్శకనిర్మాతలు.దీంతో సంక్రాంతి బరిలో మూడు సినిమాలు ఖరారైపోయాయి.

Advertisement

జనవరి 11న ఖైదీనం 150, 12న గౌతమీపుత్ర శాతకర్ణి, 13 లేదా 14న శతమానంభవతి.వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక.

రామ్ చరణ్ నిర్మాత.

Advertisement

తాజా వార్తలు