PL Narayana Ooha: ఈ టాలీవుడ్ సీనియర్ నటుడి కోడలు స్టార్ హీరోయిన్ అని తెలుసా.. ఆమె ఎవరంటే?

నటుడు పీఎల్ నారాయణ( PL Narayana ) గురించి మనందరికీ తెలిసిందే.

తండ్రి, తాగుబోతు, అమాయకమైన భర్త, బిక్షగాడు, రాజకీయ నేత ఇలా అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించారు.

అలాగే తెలుగు, తమిళ భాషల్లో దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పీఎల్ నారాయణ.

కాగా నారాయణ మేన కోడలు హీరోయిన్ గా ఊహ ( Heroine Ooha ) సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ఊహ మరెవరో కాదు హీరో శ్రీకాంత్ భార్య( Hero Srikanth ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.అలాగే ఊహ స్వయానా నారాయణకు మేనకోడలు.

తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఊహ అసలు పేరు శివరంజిని. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే తమిళంలో హీరోయిన్‌గా 20కి పైగా సినిమాల్లో నటించింది.

Advertisement

తెలుగులో తొలిసారి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో ఆమె పేరును ఊహగా మార్చాడు ఈవీవీ.ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించింది.కాగా ఊహ తెలుగులో హీరో శ్రీకాంత్‌తోనే ఎక్కువ సినిమాల్లో నటించింది.

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.ఈమె తెలుగులో తొలి, చివరి సినిమా శ్రీకాంత్‌తోనే చేయడం విశేషం.

వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇక వీరి కుమారుడు రోషన్‌ హీరోగా రాణించే ప్రయత్నాల్లో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు