అమ్మాయిలు వయసు ఎక్కువున్న వారినే ఎందుకు ఇష్టపడతారు?

ఆకర్షణ, ప్రేమ .రెండు చాలా వేరుగా ఉండే విషయాలు.

అందం ఆకర్షణని కలిగిస్తే, వ్యవహార శైలి ప్రేమను కలిగిస్తుంది.

వయసుని బట్టి కాకుండా, వ్యవహార శైలిని బట్టి కూడా మగజాతిని "BOY", "MAN" ఆంటూ విభజించారు.

అర్థం చేసుకునే గుణం ఉండి, విచక్షణ జ్ఞానం ఉన్నవారిని MAN గా, కేవలం అందాన్ని చూసి వెంటపడేవారిని, పరిణితి సాధించనివారిని BOY గా సంబోధిస్తున్నారు నేటి కాలం అమ్మాయిలు.దాదాపుగా స్వతంత్ర భావాలు ఉండి, ప్రతీ విషయాన్ని లోతుగా అలోచించే అమ్మాయిలు తమకన్నా వయసులో కనీసం 4-5 పెద్దగా ఉన్న మగవారినే ఇష్టపడుతున్నారు.

హై సొసైటిల్లో, సినిమా తారాల్లో చూస్తుంటాం.తమకన్నా, పది, పదిహేనేళ్ళ పెద్దవారిని కూడా పెళ్ళాడతారు అమ్మాయిలు.

Advertisement

ఇలా ఎందుకు? వయసు పెరిగిన మగవారంటే మక్కువ ఎందుకు పెరిగింది? దానికి కారణాలు ఏంటి ? * వయసుతో పాటు పరిణితి పెరుగుతుంది అంటారు.సందర్భానికి తగ్గ ఆలోచన విధానం, పరిస్థితులను అర్థం చేసుకునే మనస్తత్వం జీవితాన్ని ఎక్కువకాలం చూసినవారికి ఉండే అవకాశాలు ఎక్కువ.

* యుక్త వయసులో అబ్బాయిల ఏమోషన్స్ కుదురుగా ఉండటం కష్టం.ఇప్పుడు నచ్చిన అమ్మాయి, ఎప్పటికీ నచ్చతుంది అన్న గ్యారంటీ వారిలో కనబడదు.తమ కన్న వయసు తక్కువ వారిని పక్కనపెట్టడానికి ఇది కూడా ఓ కారణం.

* జీవితంలో ఓ వయసు వచ్చాక, అమ్మాయి అందం కన్నా అమ్మాయి గుణం ముఖ్యమైపోతుంది.అమ్మాయిలకు కావాల్సింది అందాన్ని మాత్రమే చూసేవారు కాదు.

* ఇటు ఆర్థికపరంగా, అటు మానసికంగా, ఓ స్టేజిలో సెటిల్ అయిపోయి ఉంటారు వయసు పెరిగిన మగవారు.అలాంటి వారితో జీవితం సురక్షితంగా అనిపిస్తుంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

* మాటతీరులో ఎంతో పరిణితి కనబడుతుంది ఎదిగిన మగవారిలో.తమను నమ్మి వచ్చిన స్త్రీతో ఎలా మెదలాలో, ఎలా మాట్లాడాలో వయస్సు పెరిగినకొద్దీ తెలిసే విషయం.

Advertisement

అందుకేనేమో, స్వతంత్ర భావాలున్న అమ్మాయిలు, అంటే రకరకాలా ప్రోఫేషన్స్ లో ఉన్నవారు లేటుగా పెళ్ళి చేసుకుంటారు.అలాగే తమకన్న పెద్దవారినో, చిన్నవారినో కాని, మరీ యుక్త వయసులో ఉన్నవారి వెంట పెద్దగా పడరు.

తాజా వార్తలు