ధనుష్ ఐశ్వర్య విడాకులు అభిమానులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.కొత్త ఏడాదిలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని ధనుష్ ఐశ్వర్య అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట 18 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలకడంతో ఎందుకు విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.అయితే ధనుష్ ఐశ్వర్యల విడాకుల సందర్భంగా ఎనిమిదేళ్ల క్రితం వీడియో వైరల్ అవుతోంది.
ధనుష్ భార్య ఐశ్వర్యపై ఉన్న ప్రేమతో పాట పాడారు.ఒక పార్టీలో ధనుష్ పాట పాడటంతో ఆశ్చర్యపోవడం ఐశ్వర్య వంతైంది.సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.కొన్ని రోజుల క్రితం కూడా ఒక ఫంక్షన్ లో ధనుష్ ఐశ్వర్య కలిసి కనిపించారు.
ధనుష్ ఐశ్వర్య విడిపోకుండా కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ధనుష్ ఐశ్వర్య భవిష్యత్తులో మళ్లీ కలుస్తారేమో చూడాల్సి ఉంది.
గతంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగాయని అయితే రజినీకాంత్ జోక్యం చేసుకోవడం వల్ల ఆ గొడవలు ఆగిపోయాయని సమాచారం.
అయితే ధనుష్ కొంతమంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకు నచ్చలేదని ఈ కారణం వల్లే ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ధనుష్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా కూడా ధనుష్ ఐశ్వర్యల మధ్య విభేదాలకు కారణమని సమాచారం.
ఇద్దరి మధ్య ఈగోల కారణంగా వీళ్లు విడిపోయారని తెలుస్తోంది.రజనీకాంత్ అటు ధనుష్ కు, ఇటు ఐశ్వర్యకు నచ్చజెప్పాలని ప్రయత్నం చేశారని అయితే ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని సమాచారం.విడాకులకు గల కారణాలను భవిష్యత్తు ఇంటర్వ్యూలలో ధనుష్ చెబుతారేమో చూడాల్సి ఉంది.పిల్లల విషయంలో ధనుష్, ఐశ్వర్య ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.