మహేష్ బాబు రీమేక్స్ జోలికి వెళ్లకపోవడానికి కారణమిదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువమంది హీరోలు రీమేక్ సినిమాలలో నటిస్తున్నారు.

సరైన కథ దొరకని సమయంలో, వరుస ఫ్లాపులు ఎదురవుతున్న సమయంలో, వేగంగా సినిమాలను పూర్తి చేయాలని భావించిన సమయంలో హీరోలు ఎక్కువగా రీమేక్ సినిమాలపై దృష్టి పెడుతుండటం గమనార్హం.

అయితే మహేష్ బాబు మాత్రం హీరోగా నటించిన సినిమాల్లో అన్ని సినిమాలు స్ట్రెయిట్ సినిమాలుగానే తెరకెక్కాయి.మహేష్ బాబు నటించిన సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్, రీమేక్ అయ్యాయి తప్ప మహేష్ బాబు ఇతర హీరోలు నటించిన సినిమాల రీమేక్ లో నటించలేదు.

మహేష్ నటించిన నాని సినిమా బై లింగువల్ మూవీగా తెరకెక్కిందే తప్ప రీమేక్ కాదు.హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి 22 సంవత్సరాలు అయినా మహేష్ బాబు మాత్రం రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

మహేష్ నటించిన ఒక్కడు, పోకిరి, నిజం, బిజినెస్ మేన్, అతిథి, అతడు సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ కావడం గమనార్హం.ఇతర హీరోలు నటించిన సినిమాల్లో నటిస్తే సినిమా హిట్టైనా పేరు రాదని నటనలో పోల్చి చూస్తారనే భావనతో మహేష్ రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంద ? లేదా ? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలపై దృష్టి పెట్టడంతో పాటు పాన్ ఇండియా కథలనే ఎంచుకుంటున్నారు.మరి సర్కారు వారి పాట ఇతర భాషల్లోకి డబ్బింగ్ అవుతుందా ? లేదా ? చూడాల్సి ఉంది.

మహేష్ అభిమానులు మాత్రం ఆయన నటిస్తున్న సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ కావడంతో పాటు పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.మరి ఫ్యాన్స్ సూచనలను మహేష్ బాబు పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీలో నటిస్తుండగా మహేష్ త్రివిక్రమ్ మూవీ ఆగష్టు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు