ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ద్వారా పాపులర్ కావడం సులువు కాదు.యూట్యూబ్ నే కెరీర్ గా మలచుకుని సక్సెస్ అయిన వాళ్ల సంఖ్య కూడా అతి తక్కువ అనే సంగతి తెలిసిందే.
అయితే సౌత్ ఇండియాలోని పాపులర్ యూట్యూబర్లలో హర్ష సాయి ఒకరు.చిన్న వయస్సులోనే యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన హర్ష సాయి అంచనాలకు మించి సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే.
యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం హర్ష సాయి ఖర్చు చేస్తున్నారు.హర్ష సాయి చేసిన వీడియోలు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.
అయితే గత కొన్ని నెలల నుంచి హర్ష సాయి నుంచి కొత్త వీడియోలు రావడం లేదు.హర్ష సాయి వీడియోలు చేయకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.హర్షసాయి యూట్యూబ్ ఛానల్ లో షార్ట్స్ వీడియోస్ కూడా రాకపోవడం ఫ్యాన్స్ ను మరింత బాధ పెడుతోంది.
హర్ష సాయి ఏ స్వార్థం లేకుండా ఎంతోమందికి సహాయం చేసినా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తమ ఛానెళ్ల పాపులారిటీ కోసం హర్షసాయి గురించి నెగిటివ్ ప్రచారం చేయడం జరిగింది.అయితే హర్ష సాయి మాత్రం తనపై వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందడుగులు వేస్తున్నారు.హర్ష సాయి మరో మంచి వీడియో కోసం ప్లాన్ చేస్తున్నారని అందువల్లే ఈ మధ్య కాలంలో వీడియోలు చేయడం లేదని తెలుస్తోంది.
మంచి వీడియోతో ప్రేక్షకుల ముందుకు హర్షసాయి రాబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.హర్ష సాయి వేగంగా వీడియోలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఫ్యాన్స్ కోరికను మన్నించి హర్షసాయి వీడియోలు చేస్తారేమో చూడాల్సి ఉంది.ఇతర భాషల్లో కూడా హర్షసాయికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.