రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావడానికి చిరంజీవి ఫెయిల్ కావడానికి అసలు కారణాలివేనా?

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు.పదేళ్ల నుంచి జనసేన విషయంలో వ్యక్తమైన విమర్శలు అన్నీ ఈ ఎన్నికల ఫలితాలతో పటాపంచలు అయ్యాయి.

21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో జనసేన విజయం సాధించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఊహించని స్థాయిలో సత్తా చాటారు.టీడీపీ జనసేన కలిసి పని చేస్తే తిరుగులేదని మరోసారి ఈ ఎన్నికల ఫలితాలతో ప్రూవ్ అయింది.

రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావడానికి చిరంజీవి ఫెయిల్ కావడానికి కారణం ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని( Praja Rajyam Party ) కాంగ్రెస్ లో విలీనం చేసి తప్పు చేశారని ప్రజారాజ్యం పార్టీని కొనసాగించి ఉంటే చిరంజీవి ఎప్పుడో సీఎం అయ్యేవారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తనపై కొంతమంది నేతలు చేసిన విమర్శలను సీరియస్ గా తీసుకోవడం చిరంజీవికి మైనస్ అయింది.

Advertisement

చిరంజీవి ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రజారాజ్యం పార్టీ టికెట్లు అమ్ముకుందనే ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీకి మైనస్ అయింది.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీతో దాదాపుగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేశారు.జనసేన పార్టీపై అవినీతి మరక పడకుండా పవన్ జాగ్రత్త పడ్డారు.

బలం ఉన్న చోట మాత్రమే పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేసి పార్టీ సక్సెస్ అయ్యేలా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు.

పవన్ కెరీర్ పరంగా వేసిన అడుగులు సరైన అడుగులు అని అందువల్లే ఆయనకు సరైన ఫలితాలు దక్కాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన ఫలితాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.పవన్ భవిష్యత్తులో సీఎం కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు