బిగ్ బాస్ షో సక్సెస్ కావడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా నిలిచింది.

హిందీలో ఈ షో సక్సెస్ కాగా దక్షిణాది భాషల్లో సైతం బిగ్ బాస్ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ నెల 5వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రసారం కానుండగా ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా నాగార్జున ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.ప్రతి ఒక్కరికీ ఇతరుల లైఫ్ లో తొంగి చూడాలని ఉంటుంది.

ప్రస్తుతం మనుషులు ప్రైవేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.ప్రస్తుతం మనుషులు సమస్యలతో పాటు సంతోషాన్ని కూడా దాచుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు.

నగరాలలో అయితే పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలిసే పరిస్థితి ప్రస్తుతం లేదు.అయితే ఈ వెలితిని క్యాష్ చేసుకుంటూ సెలబ్రిటీల యొక్క రియల్ బిహేవియర్ ను ప్రేక్షకులకు తెలియజేసే షోగా బిగ్ బాస్ షో పేరు తెచ్చుకుంది.

Advertisement

బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 భారీ స్థాయిలో సక్సెస్ కావడానికి లవ్ ట్రాకులు కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.ఇప్పటివరకు బిగ్ బాస్ షోలో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొంటూ వచ్చారు.

అయితే బిగ్ బాస్ సీజన్ 5లో మాత్రం ఏకంగా 20 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఉండరని సమాచారం.ఇప్పటికే ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీల జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

100 రోజులు ఫ్యామిలీని, కెరీర్ ను వదిలిపెట్టి బిగ్ బాస్ షోలో పాల్గొనాల్సి ఉండటంతో కొంతమంది సెలబ్రిటీలు ఈ షో విషయంలో ఆసక్తి చూపడం లేదు.ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ చాలామంది సెలబ్రిటీలకు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు