ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎంతటి ఉద్దండులనైనా ముప్పుతిప్పలు పెట్టే సినిమా నటుడు మోహన్ బాబు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కంటిలో నలుసులా మారాడు.ఎన్టీఆర్ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు.
రాజ్యసభ సభ్యత్యం ముగిసిన తర్వాత మోహన్ బాబుకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది.దీంతో ఆయన అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
అలాగే ఇక వైయస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మోహన్ బాబు ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది.
ఆ తర్వాత మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇక అప్పటి నుంచి ఈ ఇరు కుటుంబాల మధ్య స్నేహం మరింత పెరిగింది.

ఇక మోహన్ బాబు విషయానికి వస్తే మోహన్ బాబు అనేక సందర్భాల్లో చంద్రబాబు కి వ్యతిరేకంగా మాట్లాడాడు.ఆ కక్షో లేక సాధారణంగానే తెలియదు కానీ మోహన్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ విద్య నికేతన్ సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు ఆగిపోయాయి.దీంతో ఇప్పుడు మంచి సమయం చూసుకుని మోహన్ బాబు ధర్నాకు దిగడం చర్చనీయాంశం అవుతోంది.
ఈ ధర్నా వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టుగా కూడా చర్చ నడుస్తోంది.ఎన్నికల సమయంలో అదును చూసుకుని మోహన్ బాబు ఈ ధర్నాకు దిగడం వెనక జగన్ ప్లాన్ ఉందని టీడీపీ ఆరోపణలు మొదలుపెట్టింది.

ఆయనొక్కడే కాదు బాబు సామజిక వర్గానికి చెందిన పోసాని కూడా ఇప్పుడు బాబు మీద తిట్ల దండకం మొదలుపెట్టాడు.ఇదంతా టీడీపీకి ఎన్నికల సమయంలో రాజకీయంగా చిక్కులు తెచ్చేందుకే అని స్పష్టంగా అర్ధం అవుతోంది.మోహన్ బాబు కూడా ఈ ధర్నా సందర్భంగా రాజకీయ విమర్శలు గుప్పించాడు.తెలుగుదేశం పార్టీని ప్రతీసారి నా పార్టీ నా పార్టీ అంటావే చంద్రబాబు ? అది అన్నగారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.నీవే ఆయన వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు అంటూ మండిపడ్డారు.చంద్రబాబు అంటే నాకూ ఇష్టమే కాకపోతే ఆయన నాటకాలు మాత్రం ఇష్టం లేదన్నారు.
సినిమాల్లో నటిస్తే డబ్బిస్తారు కానీ చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తున్నారు అంటూ వ్యంగ్యాస్థ్రాలు వదిలారు.