మీరు ఎపుడైనా గమనించారో లేదోగానీ హిందూ పండుగలప్పుడే మార్కెట్లో తదనుగుణంగా అవసరమైన వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి.అవును, హిందువులు దోపిడీకి గురవ్వడానికి పండగలు మాధ్యమాలుగా మారాయి.
పండుగలు వస్తే చాలు నేడు సగటు మధ్య తరగతికి చెందిన హిందువులు పండుగలు చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.కొనేందుకు డబ్బు పెట్టడానికే భయపడే పరిస్థితికి హిందూ భక్తులను తీసుకొచ్చింది ఎవరు? భారతదేశంలో అన్నిమతాల వారూ ఉన్నారు.ఇక్కడ ఇతర మతాలను గౌరవిస్తూ అందరూ కలిసిమెలిసి వుంటారు.
ఇక ఇక్కడ ఎవరి సంప్రదాయం ప్రకారం వారు పండుగలు జరుపుకుంటారు.
అయితే ఇతర మతాలవారు తమతమ పండుగలను జరుపుకున్నపుడు పెరగని ధరలు మాత్రం హిందూ పండుగలు అనగానే ఒక్కసారిగా ధరలకు రెక్కలు వస్తాయి.చిన్న పత్రి నుంచి విలువైన బంగారం వరకు అన్నీ ఇక్కడ పెరుగుతాయి.ఇక్కడ విచిత్రమేమిటంటే ఇతర మతాల పండుగల వేళ.అవే ధరలు ఎంతోకొంత తగ్గుతూ ఉండడం మనం గమనించవచ్చు.ఏ పండుగలకు లేనివిధంగా హిందూ పండుగల వేళనే ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు.

సాధారణ రోజల్లో పూజకు కావలసిన వస్తువులు… అరటిపళ్ళు, కొబ్బరికాయ, పత్రి, పసుపు, కుంకుమ, మంచినూనె, అగరబత్తీలు, కొవ్వొత్తులు…. వగైరా ధరలు కనీస ధరలోనే ఉండగా పండుగలు వచ్చేసరికి మాత్రం ఈ ధరలు 3 రెట్లు అధికం అవుతాయి.హిందు పండుగల్లో పాలు, పండ్లకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది.
పండుగ ఏదైనా పాలు, పండ్లు, స్వీట్లు కొనాలంటే ఇక అంతే… మన ఆస్తులు అడుగుతారు.వినాయక చవితి రోజు పరిస్థితి ఎలాగుంటుంది ఇక్కడ వివరించాల్సిన పనిలేదు.

సీజనల్ ఫ్రూట్స్ రేట్లు కూడా నాలుగింతలు రెట్టింపు అవతాయి. శివరాత్రి సీజన్ వేళ జామ, యాపిల్, ద్రాక్ష, బత్తాయి, అరటి పండ్ల రేట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు.మొత్తంగా హిందూ పండుగలనే వ్యాపారులు తమ ఆదాయ వనరుగా మార్చుకొని భక్తులను క్యాష్ చేసుకుంటున్నారు.ఈ పరిస్థితి మిగతా మతాల పండగలప్పుడు మాత్రం కనిపించకపోవడం కొసమెరుపు.ఇక దీనికి కారకులు ఎవరో ఆలోచించండి!







