కొత్త బైక్ కొనుగోలు చేసిన ధోనీ.. దాని ధర, ఫీచర్లు ఇవే!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పడం లేదు.కాగా తాజాగా ఈ మిస్టర్ కూల్ తన కలెక్షన్‌లో కొత్త మోటార్‌సైకిల్‌ను చేర్చుకున్నాడు.

 Ms Dhoni Buys Tvs Ronin Bike Pics Viral Details, Tvs Ronin, Mahendra Singh Dhoni-TeluguStop.com

ఈసారి అతను TVS రోనిన్‌ని ఎంచుకున్నాడు.పాతకాలపు మోటార్‌సైకిళ్లు, హై-ఎండ్ కార్లతో నిండిన అతని గ్యారేజీలోనే ఇది చాలా తక్కువ ఖరీదైనదని చెప్పొచ్చు.

Telugu Cricket, Cricketer Dhoni, Dhoni Bike, Dhonitvs, Mahendrasingh, India Cric

టీవీఎస్ రోనిన్ గత సంవత్సరం భారతదేశంలో లాంచ్ అయిన మోటార్‌సైకిల్.ఇది 225.9 cc ఇంజన్‌తో 20.5 PS పవర్, 19.93 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌తో 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ బైక్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.దీని ధర రూ.1.49 లక్షల నుంచి రూ.1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

Telugu Cricket, Cricketer Dhoni, Dhoni Bike, Dhonitvs, Mahendrasingh, India Cric

ఎం.ఎస్ ధోనీ టీవీఎస్ రోనిన్ టాప్-ఎండ్ వేరియంట్‌ను గెలాక్సీ గ్రే కలర్‌లో కొనుగోలు చేశాడు.ఈ వేరియంట్ డ్యూయల్-ఛానల్ ABSతో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్స్, డిజిటల్ స్పీడోమీటర్, అడ్జస్టబుల్ లివర్స్, ఆల్-ఎల్ఈడీ టెయిల్ లైట్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.రోనిన్ రెయిన్ అర్బన్ అనే 2 డిఫరెంట్ ABS మోడ్‌లతో వస్తుంది.

టీవీఎస్ మోటార్ కంపెనీలో ప్రీమియం మోటార్‌సైకిళ్ల బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లీ కొత్త టీవీఎస్ రోనిన్ కీలను ఎంఎస్ ధోనీకి అందజేశారు.దానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube