కొత్త బైక్ కొనుగోలు చేసిన ధోనీ.. దాని ధర, ఫీచర్లు ఇవే!
TeluguStop.com

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పడం లేదు.


కాగా తాజాగా ఈ మిస్టర్ కూల్ తన కలెక్షన్‌లో కొత్త మోటార్‌సైకిల్‌ను చేర్చుకున్నాడు.


ఈసారి అతను TVS రోనిన్‌ని ఎంచుకున్నాడు.పాతకాలపు మోటార్‌సైకిళ్లు, హై-ఎండ్ కార్లతో నిండిన అతని గ్యారేజీలోనే ఇది చాలా తక్కువ ఖరీదైనదని చెప్పొచ్చు.
"""/" /
టీవీఎస్ రోనిన్ గత సంవత్సరం భారతదేశంలో లాంచ్ అయిన మోటార్‌సైకిల్.
ఇది 225.9 Cc ఇంజన్‌తో 20.
5 PS పవర్, 19.93 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌తో 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ బైక్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
71 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. """/" /
ఎం.
ఎస్ ధోనీ టీవీఎస్ రోనిన్ టాప్-ఎండ్ వేరియంట్‌ను గెలాక్సీ గ్రే కలర్‌లో కొనుగోలు చేశాడు.
ఈ వేరియంట్ డ్యూయల్-ఛానల్ ABSతో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.
ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్స్, డిజిటల్ స్పీడోమీటర్, అడ్జస్టబుల్ లివర్స్, ఆల్-ఎల్ఈడీ టెయిల్ లైట్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
రోనిన్ రెయిన్ అర్బన్ అనే 2 డిఫరెంట్ ABS మోడ్‌లతో వస్తుంది.టీవీఎస్ మోటార్ కంపెనీలో ప్రీమియం మోటార్‌సైకిళ్ల బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లీ కొత్త టీవీఎస్ రోనిన్ కీలను ఎంఎస్ ధోనీకి అందజేశారు.
దానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ఎండ వల్ల నల్లగా మారిన చేతులు, పాదాలను ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!