బిహార్ రాష్ట్రం, కైమూర్ జిల్లా, మోహనియాలో ఇంటర్ పరీక్షలు రాసేవారికి ఒక వింత సమస్య ఎదురయింది.వివరాల్లోకి వెళ్తే ఇంటర్ బోర్డు ఎగ్జామ్ నిర్వాహకులు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించమని ఆదేశించారు.
దాంతో విద్యార్థులు సమయానికి పరీక్ష హాల్‌కి వచ్చేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో ఎగ్జామ్ రాయడానికి బయల్దేరిన కొందరు విద్యార్థులు నేషనల్ హైవే2లో అయిన భారీగా ట్రాఫిక్ జామ్ వళ్ల బాగా ఆందోళన పడ్డారు.

తల్లిదండ్రులతో ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరిన వీరు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ముందుకు కదలలేకపోయారు.ఆలస్యమైతే ఎగ్జామ్ రాయడం కుదరదని వారు ఉరుకులు పరుగులు పెట్టారు.పరుగు పందెంలో ఉరికినట్లు వారు రోడ్ల వెంబడి కూడా పరిగెత్తారు.ఆ ట్రాఫిక్‌లో వాహనాలు ఎంతసేపటికీ అడుగు దూరం కూడా కదలకపోవడంతో మీరు ఈ పని చేశారు.
మొత్తం మీద ఇంటర్ పరీక్ష రాసే ఈ అమ్మాయిలు 2 కిలోమీటర్లు పరిగెత్తారు.చివరికి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.ఈ అమ్మాయిలు పరిగెత్తడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిని గమనించిన ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు తీసుకున్నారు.మధ్యాహ్నం ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లు జాగ్రత్తలు తీసుకున్నారు.కాగా ఇంటర్ బాలికలు పడిన అవస్థలను చూసి స్థానికులు అధికారులపై ఫైర్ అయ్యారు.
రాంగ్ రూట్‌లో వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని చివాట్లు పెట్టారు.







