దీపావళి అంటే కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఈ పండుగను జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఇటీవలే మనం దీపావళి పండుగను జరుపుకున్నాం.
యథావిధిగా అందరూ పటాకులు పేల్చి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.అయితే ప్రతి ఏటా దీపావళి రోజున భారత్‌ను శాటిలైట్ ఫొటో తీసే నాసా ఈ సారి అలా చేయలేదు.
ఎందుకంటే ప్రతి సారీ దీపావళి రోజున నాసా విడుదల చేస్తున్న భారత దేశ శాటిలైట్ ఫొటో అసలుది కాదట.ఎప్పుడో తీసిన ఫొటోను నాసా ప్రతి ఏటా షేర్ చేస్తూ వస్తోంది.
దీంతో ఆ ఫొటో అసలుది కాదని ఎప్పుడైతే అందరికీ తెలిసిందో అప్పుడే నాసా నవ్వుల పాలైంది.ఈ క్రమంలోనే ఈ ఏడాది నాసా దీపావళి ఫొటోను విడుదల చేయలేదు.
అయితే ఓ వ్యక్తి దాన్ని విడుదల చేశాడు.

అతని పేరు పౌలో నెస్పోలి.ఇతను యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో వ్యోమగామి (అస్ట్రోనాట్)గా పనిచేస్తున్నాడు.గత కొంత కాలంగా ఓ మిషన్ లో భాగంగా ఇతను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్నాడు.
ఈ క్రమంలోనే పౌలో దీపావళి రోజున అంతరిక్షం నుంచి తీసిన భారత్ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్ అయింది.కొన్ని గంటల్లోనే ఆ ఫొటో కొన్ని వేల సంఖ్యలో షేర్ అయింది.వేల కొద్ది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి.
పోస్టులో పౌలో హ్యాపీ దివాలీ అని చెబుతూ ఆ ఫొటోను పెట్టారు.దీనికి గాను చాలా మంది భారతీయులు అతనికి థాంక్స్ చెప్పారు.! ఆ ఫొటోను మీరు పైన వీక్షించవచ్చు.!
.