ఈ మధ్యకాలంలో సినిమాల లీకుల బెడద అన్నది దర్శకనిర్మాతలకు పెద్ద సమస్యగా మారిపోయింది.ఎంత పకడ్బందీగా షూటింగ్ చేస్తున్న కూడా సినిమాలకు సంబంధించిన ఫోటోలు ఏదో రకంగా సోషల్ మీడియాలో బయటకు వస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా రం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్నారు.
ఇక్కడ దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా కూడా దర్శకత్వం వహిస్తూ ఉండడంతో పది రోజులు చరణ్తో మరొక పది రోజులు కమాన్ హాసన్ తో అన్నట్టుగా డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఆర్సి15 సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
అయితే ఒకసారి లేదా రెండుసార్లు అంటే ఏదో మిస్టేక్ అని అనుకోవచ్చు.కానీ ఆర్సి 15 లుక్స్ పదేపదే లీక్ అవడం అన్నది దిల్ రాజు ఫెయిల్యూర్ అనే చెప్పవచ్చు.
కాగా ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్న కూడా రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన ఫొటోస్ లీక్ అవుతూనే ఉన్నాయి.మరి ఇప్పటికైనా నిర్మాత దిల్ రాజు చేరుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారో లేదో చూడాలి మరి.ఈ విధంగా రామ్ చరణ్ లుక్ లీకై వైరల్ అవడం సినిమాపై ఉన్న క్యూరియాసిటీ , ఆ లుక్ రిలీజ్ చేసేటప్పుడు ఉండాల్సిన హైప్ అన్ని పోతాయి.తాజాగా లీకైన ఆ ఫోటోలో పంచ కట్టులో తన భార్య కొడుకుతో రామ్ చరణ్ కనిపిస్తూ ఉండడం చూస్తూ ఫాన్స్ రకరకాల ఊహాగానాలు మొదలు పెట్టేసారు.