ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది.దీనిలో భాగంగా వసంత విహార్ లో బీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.
దాదాపు 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం కొనసాగుతోంది.కాగా, ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.మరో రెండు రోజులపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది.
ఈ క్రమంలో పలువురు జాతీయ నేతలతో ఆయన సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం ఢిల్లీలోని ఓ అద్దె భవనంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.