రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది.ఇప్పటివరకు క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో ఉన్న నిబంధనలను ఆర్బీఐ పూర్తిగా మార్చేసింది.
ఈ సంవత్సరం జనవరి నెలలోనే క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి పలు నిబంధనలు ఆర్బీఐ ప్రకటించినా వివిధ కారణాల వల్ల ఆ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు.దీంతో సెప్టెంబర్ 30 నుంచి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ద్వారా పీఓఎస్ టెర్మినల్స్, ఏటీఎంలలో మాత్రమే వినియోగించే డొమెస్టిక్ కార్డులను మాత్రమే జారీ చేయనుంది. డొమెస్టిక్ కార్డులను కేవలం మన దేశంలో మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఎవరైనా వినియోగదారులు కార్డులను ఇతర దేశాల్లో కూడా వినియోగించుకోవాలని భావిస్తే బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు చేసి ఇంటర్నేషనల్ లావాదేవీలకు అనుమతులు పొందే అవకాశం ఉంటుంది.
ఇకపై వినియోగదారులు తమకు అవసరమైన కాంటాక్ట్ లెస్, కార్డ్ లెస్, ఆన్ లైన్ లావాదేవీలను మాత్రమే జరుపుకునే వీలు ఉంటుంది.
బ్యాంకులు ఈ నెల 30వ తేదీ తరువాత జరపబోయే లావాదేవీలన్నింటికీ ఈ నిబంధనలే వర్తించనున్నాయి.ఇప్పటికే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి కొన్ని సేవలు ఈ నెల 30 నుంచి ఆగిపోతున్నాయి.
వినియోగదారులు ఏవైనా సేవలను పొందాలంటే బ్యాంకులను సంప్రదించి పొందవచ్చు.సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాంకులను సంప్రదించి కోరుకున్న సర్వీసులు 24 గంటల్లో యాక్టివేట్ అవుతాయి.