ఆర్బీఐ నిర్ణయంతో ఇకపై 24 గంటలు డబ్బులు పంపుకోవచ్చు

కాలం మారుతూ వస్తుంది, టెక్నాలజీ మారుతూ వస్తుంది.

ఇలాంటి సమయంలో ఆర్బీఐ కూడా తన పాత విధానాలకు పాతర వేసి కొత్త నిర్ణయాలను అమలు చేస్తూ ప్రజలకు మరింత మంచి సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.

గతంలో నెఫ్ట్‌ విధానంలో డబ్బును కేవలం ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చేసే వీలు ఉండేది.కాని ఇప్పుడు నెఫ్ట్‌ విధానంలో రోజులో 24 గంటలు మరియు సెలవు దినాల్లో కూడా ట్రాన్సపర్‌ చేసుకునే వీలు కలుగుతుంది.

ఆర్బీఐ తీసుకు వచ్చిన ఈ నిర్ణయం కొంత మంది బ్యాకర్స్‌ వ్యతిరేకిస్తున్నా ఎక్కువ శాతం మంది ప్రజలు మాత్రం అభినందిస్తున్నారు.తప్పకుండా ఇది మంచి చేస్తుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో నెఫ్ట్‌ విధానంలో డబ్బు ట్రాన్సపర్‌ చేస్తే కటింగ్‌ ఉండేది.కాని ఇప్పుడు ఎలాంటి చార్జీలు లేకుండానే నెఫ్ట్‌ చేసుకోవచ్చు అంటూ ఆర్బీఐ ప్రకటించింది.

Advertisement

మీ డబ్బు మీరు ఎప్పుడైనా పంపించుకోండి, ఎలా అయినా వినియోగించుకోండి అంటూ ఆర్బీఐ ఈ నిర్ణయంకు వచ్చింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు