ఓవర్ చేయకు నీ దిష్టే తగులుతుంది.. హరీష్ శంకర్ పోస్ట్ పై రవితేజ షాకింగ్ కామెంట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రవితేజ( Raviteja ) ఒకరు.

ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్( Mister Bachchan ) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ నెలలోనే విడుదలకు సిద్ధమవుతుంది.ఈ క్రమంలోనే షూటింగ్ పనులను త్వరగా పూర్తిచేసే క్రమంలో చిత్ర యూనిట్ ఉన్నారు.ఇక తాజాగా చిత్ర బృందం కాశ్మీర్ లో( Kashmir ) షూటింగ్ పనులను జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇక్కడ ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

Advertisement

ఇందులో ఈయన ఒక బెంచ్ పై కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉన్నారు.

ఇక ఈ ఫోటోని షేర్ చేసిన హరీష్ శంకర్ ఇలా రాసుకొచ్చారు.ప్రపంచకంలో అందరికి వయసొస్తుంది ఒక్క అన్నయ్యకి తప్ప అంటూ .కాశ్మీర్ లోయలో అద్భుతంగా షూటింగ్ చేసాం త్వరలో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాం అంటూ ట్వీట్ చేసారు.ఇక ఈ ట్వీట్ పై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందించగా చివరికి రవితేజ కూడా హరీష్ శంకర్ చేసిన ట్వీట్ పై స్పందించారు.

ఓవర్ చేయకురోయ్.నీ దిష్టే తగిలేలా వుంది అంటూ ట్వీట్ చేసారు.

ప్రస్తుతం రవితేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో ఈయన అమితాబ్ బచ్చన్ కి అభిమానిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు