ఖిలాడితో రిస్క్ చేస్తున్న రవితేజ..!

మాస్ మహరాజ్ రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో క్రేజీ మూవీగా వస్తుంది ఖిలాడి.సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

క్రాక్ తో హిట్ అందుకున్న రవితేజ ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు.రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

అయితే లేటెస్ట్ గా డైరక్టర్ రమేష్ వర్మ తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖిలాడి బడ్జెట్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.రవితేజ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఖిలాడి సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది.

రవితేజ ఖిలాడి సినిమా 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని చెప్పారు.మాస్ రాజా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలే 60 కోట్ల కలక్షన్స్ రాబట్టాయి అలాంటిది ఖిలాడి సినిమా ఆ ఫిగర్ కు మరో 5 కోట్లు మించి బడ్జెట్ పెట్టేశారు.

Advertisement

అయితే రమేష్ వర్మ మాత్రం రవితేజకు ఆ బడ్జెట్ అయినా వర్క్ అవుట్ చేసే స్టామినా ఉందని అంటున్నారు.ఖిలాడి సినిమా కచ్చితంగా లాభాలు తెస్తుందని నమ్మకంతో ఉన్నారు.

మరి రవితేజ ఖిలాడి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు