Raviteja: క్రాక్‌, టైగర్ నాగేశ్వరరావు సినిమాల మధ్య కనెక్షన్ ఇదే.. మాస్ మహారాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ?

మాస్ మహారాజా రవితేజ( Raviteja ) తాజాగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Raviteja Krack And Tiger Nageswara Rao Connection Story-TeluguStop.com

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని తదితరులు వచ్చారు.ఇక ఈ వేదిక పై గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

క్రాక్‌, టైగర్ నాగేశ్వరరావు సినిమా మధ్య ఒక కనెక్షన్ ఉందట.

ఇంతకీ ఆ కనెక్షన్ ఏంటా అనుకుంటున్నారా. టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao ) స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక రవితేజ, దర్శకుడు గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్‌ సినిమా( Krack Movie ) కూడా నిజ జీవిత పాత్రలు ఆధారంగా తెరకెక్కిందే.

ఒంగోలు ప్రాంతంలో సీఏ మురళి, రౌడీ కఠారి కృష్ణ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని గోపీచంద్ ఆ సినిమాని తెరకెక్కించాడు.

అయితే అదే సీఏ మురళి టైగర్ నాగేశ్వరరావుని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడట.ఒంగోలు కంటే ముందు స్టువర్టుపురం ప్రాంతంలో( Stuartpuram ) ఆ పోలీస్ పని చేశాడట.ఈ విషయాన్ని గోపిచంద్ మలినేని నిన్న తెలియజేయడంతో ఆడియన్స్ బాగా హై ఫీల్ అయ్యారు.

దీంతో అభిమానులు ఇది రవితేజ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా ఈ చిత్రం తరువాత రవితేజ, గోపీచంద్ మలినేని కలిసి మళ్ళీ మరో మూవీ చేయబోతున్నారు.

మరి ఈ సినిమాలో ఎలాంటి పాత్రని చేస్తాడో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube