Raviteja: క్రాక్‌, టైగర్ నాగేశ్వరరావు సినిమాల మధ్య కనెక్షన్ ఇదే.. మాస్ మహారాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ?

మాస్ మహారాజా రవితేజ( Raviteja ) తాజాగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని తదితరులు వచ్చారు.

ఇక ఈ వేదిక పై గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

క్రాక్‌, టైగర్ నాగేశ్వరరావు సినిమా మధ్య ఒక కనెక్షన్ ఉందట. """/" / ఇంతకీ ఆ కనెక్షన్ ఏంటా అనుకుంటున్నారా.

టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao ) స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇక రవితేజ, దర్శకుడు గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్‌ సినిమా( Krack Movie ) కూడా నిజ జీవిత పాత్రలు ఆధారంగా తెరకెక్కిందే.

ఒంగోలు ప్రాంతంలో సీఏ మురళి, రౌడీ కఠారి కృష్ణ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని గోపీచంద్ ఆ సినిమాని తెరకెక్కించాడు.

"""/" / అయితే అదే సీఏ మురళి టైగర్ నాగేశ్వరరావుని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడట.

ఒంగోలు కంటే ముందు స్టువర్టుపురం ప్రాంతంలో( Stuartpuram ) ఆ పోలీస్ పని చేశాడట.

ఈ విషయాన్ని గోపిచంద్ మలినేని నిన్న తెలియజేయడంతో ఆడియన్స్ బాగా హై ఫీల్ అయ్యారు.

దీంతో అభిమానులు ఇది రవితేజ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా ఈ చిత్రం తరువాత రవితేజ, గోపీచంద్ మలినేని కలిసి మళ్ళీ మరో మూవీ చేయబోతున్నారు.

మరి ఈ సినిమాలో ఎలాంటి పాత్రని చేస్తాడో చూడాలి మరి.

మళ్లీ రేవ్ పార్టీ రగడ..అంతా మూణ్ణాళ్ల ముచ్చట..బిక్కుబిక్కుమంటున్న తారలు