రవితేజ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

కరోనా లాక్ డౌన్ ను ప్రభుత్వం నిషేధించిన తర్వాత.అన్ని పరిశ్రమ రంగాలు తెర్చుకోగా సినీ పరిశ్రమలో తిరిగి సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి.

కరోనాకు ముందు వాయిదా పడిన సినిమా షూటింగులు తిరిగి ప్రారంభం కాగా వచ్చే ఏడాది లో చాలా వరకు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.అంతేకాకుండా మాస్ మహారాజ్ రవితేజ న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులకు గిఫ్ట్ ను అందిస్తున్నాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న "క్రాక్" చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు.అంతే కాకుండా శృతిహాసన్ హీరోయిన్ గా మరోసారి ఎంట్రీ ఇస్తుంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదల కాగా.ఆ పాటలు తెగ పాపులర్ అయ్యాయి.

Advertisement

పాటల చిత్రీకరణకు ప్రత్యేకంగా గోవా కు వెళ్లి షూటింగ్ చేశారు.

కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న క్రైమ్ గురించి దృష్టిలో పెట్టుకుని తీసినట్లు నిర్మాతలు తెలుపుతున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.దీంతో మాస్ మహారాజా అభిమానులకు ఇది నిజంగానే న్యూ ఇయర్ గిఫ్ట్ గా మారుతుందని అర్థమవుతుంది.

ఈ విడుదలను సోషల్ మీడియా వేదికగా చేయడానికి ప్లాన్ లో ఉన్నారు.కాగా గోపీచంద్, రవితేజ కాంబినేషన్ లో రెండు సినిమాలు రాగా అవి మంచి విజయాన్ని సాధించాయి.

అదే విధంగా ఈ చిత్రం కూడా అదే స్థాయిలో విజయాన్ని అందిస్తుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రోజున విడుదల చేస్తామని సినీ బృందం తెలిపారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు