మాస్ మహారాజ్ రవితేజ అంటే మాస్ కంటెంట్ కథలు, హైపర్ యాక్టివ్ హీరోయిజం కోరుకునే వారికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు.అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన రవితేజ ఈ రోజు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
అతని సినిమా రిలీజ్ అయ్యింది అంటే ఓపెనింగ్ కలెక్షన్ కి ఎలాంటి డోకా ఉండదు.సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది దర్శకుడు సామర్ధ్యం, కథ చెప్పే విధానం బట్టి ఉంటుంది.
నటుడుగా మాత్రం రవితేజ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదనే చెప్పాలి.అతని ప్రతి సినిమాలోని రవితేజలోని పూర్తి స్థాయి నటుడుని తెరపై ఆవిష్కరిస్తాడు.
అందుకే ఫెయిల్యూర్స్ వస్తున్న కూడా అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.సరైన కంటెంట్ తో సినిమా పడితే కలెక్షన్ సునామీ సృష్టించడం పక్కా అని రాజా ది గ్రేట్ సినిమాతో రుజువు చేశాడు.
ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో మరో సారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.తనకి భాగా అచ్చొచ్చిన ఈ పాత్రలో మరో సారి హిట్ కొట్టాలని రవితేజ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.
శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుంది.కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా చెబుతూ హీరో రవితేజ కొన్ని ఫొటోలను షేర్ చేశారు.మిస్సింగ్ ద సెట్స్, షూట్ స్టార్ట్స్ సూన్ అంటూ రవితేజ షేర్ చేసిన ఫొటోలలో ఆయన లుక్ చాలా స్టైలిష్ గా ఉంది.
ఇడియట్ నాటి రవితేజని ఫ్యాన్స్ అతనిలో చూసుకుంటున్నారు.నెటిజన్లు సూపర్ సార్ అంటూ ఏకంగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.