బెస్ట్ ఫీల్డర్ అవార్డు పొందిన రవీంద్ర జడేజా.. అమేజింగ్ క్యాచ్ కు బీసీసీఐ ఫిదా..!

వన్డే వరల్డ్ కప్ లో( ODI World Cup 2023 ) తాజాగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టుపై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు( Bangladesh ) నిర్నిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు.కీలక సమయాలలో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా అద్భుత ఆటను ప్రదర్శించడం వల్ల బంగ్లాదేశ్ జట్టు భారీ పరుగులు నమోదు చేయడంలో విఫలమైంది.

ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడుతున్న భారత జట్టు( Team India ) బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ లోను చాలా బలంగా ఉందని తాజాగా జరిగిన మ్యాచ్ ద్వారా స్పష్టంగా అర్థమైంది.లక్ష్య చేతనకు దిగిన భారత జట్టు 41.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.రన్ మెషిన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) 97 బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఈ మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) బెస్ట్ ఫీల్డర్ గా తన సత్తా ఏంటో చాటాడు.మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బుమ్రా వేసిన 40 మూడవ ఓవర్ లో ముష్ఫికర్ రహీమ్( Mushfiqur Rahim ) బ్యాక్ వర్డ్ పాయింట్ లో షాట్ కొట్టాడు.రవీంద్ర జడేజా డైవింగ్ చేసి అమేజింగ్ క్యాచ్ పట్టేశాడు.

Advertisement

చాలా వేగంగా వెళుతున్న బంతిని క్షణాల్లో పట్టుకోవడంతో రవీంద్ర జడేజా ఫీల్డింగ్ కు బీసీసీఐ ఫిదా అయ్యింది.మ్యాచ్ అనంతరం బీసీసీఐ బెస్ట్ ఫీల్డర్ అవార్డు తో( Best Fielder Award ) రవీంద్ర జడేజాను సత్కరించింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

తాజా వార్తలు