జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Hyper Adi ) సినిమా స్పీచ్ లు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి.అప్పట్లో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సినిమా లేదా ఇతర ఏ హీరో సినిమా ఫంక్షన్ లో పాల్గొన్నా కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా కామెంట్స్ చేస్తూ ఉండేవాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కాంపౌండ్ నుండి బండ్ల గణేష్ దూరంగా ఉంటున్నాడు.అందుకే హైపర్ ఆది ఆ బాధ్యతను తీసుకున్నాడా అన్నట్లుగా ప్రతి సందర్భం లో కూడా హైపర్ ఆది తెగ సందడి చేస్తున్నాడు.
ప్రతి హీరోను కూడా నువ్వు దేవుడివి అన్నట్లుగా హైపర్ ఆది చేస్తున్న వ్యాఖ్యలు కొందరికి నచ్చుతూ ఉంటే కొందరు మాత్రం ఆది తీరును తీవ్రంగా తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

నిన్న రవితేజ( Ravi Teja ) హీరోగా నటించిన రావణాసుర సినిమా( Ravanasura movie ) ఈవెంట్ జరిగింది.ఆ కార్యక్రమం లో రవితేజ గురించి హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.సరే రవితేజ అంటే ఇష్టం ఉండి ఆ స్థాయిలో మాట్లాడాడేమో అనుకోవచ్చు కానీ.
రవితేజ కంటే ముందు ఇతర హీరోల గురించి కూడా హైపర్ ఆది అలాగే మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల్లో నటించాలని ఆశ పడుతున్న హైపర్ ఆది ఇలా హీరోలను కాకా పడుతున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఎంత కాక పట్టినా కూడా హీరోగా అవకాశాలు రావడం కష్టమే తమ్ముడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.కమెడియన్ గా రాబోయే తరాలకు బ్రహ్మానందం నువ్వే అంటూ కామెంట్స్ చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు.
మొత్తానికి హైపర్ ఆది స్పీచ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంది.తాజాగా మరో సారి హైపర్ ఆది యొక్క రవితేజ సినిమా ఈవెంట్ స్పీచ్ వైరల్ అవుతుంది.







