గంజాయి తినేసిన ఎలుకలు.. ఈ నేరస్తులు ఎలా తప్పించుకున్నారంటే..?

తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నేరస్తులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

సాక్షులను ప్రభావితం చేయడం, జరిగిన దాన్ని వేరేలా క్రియేట్ చేసి చెప్పడం, సాక్ష్యాలను తారుమారు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఇలా తాము తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అనేక ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ఉంటాయి.తాజాగా కొంతమంది నేరస్తులు ఎలుకల వల్ల బయటపడ్డారు.

చెన్నైలో( Chennai ) ఈ ఘటన చోటుచేసుకుంది.

తమిళనాడులోని మెరినీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజగోపాల్, నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు బీచ్ పరిసరాల్లో గంజాయి( Cannabis ) అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు.పోలీసులు వారిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.వాళ్ల నుంచి మొత్తం 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని స్టోర్‌హౌస్‌లో పోలీసులు దాచిపెట్టారు.2020లో ఈ ఘటన జరిగింది.వారిని రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచారు.

Advertisement

అయితే ఇటీవల నిందితులపై కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

మంగళవారం స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది.ఈ సందర్బంగా కోర్టు సాక్ష్యాధారాలను సమర్పించాలని పోలీసులను కోరింది.అయితే గంజాయిని స్టోర్‌హౌస్‌లో దాచిపెట్టగా.

ఎలుకలు( Rats ) తినేసిట్లు పోలీసులు చెప్పడంలో అందరూ ఆశ్చర్యపోయారు.సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది.

దీంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది.ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కోర్టు సీరియస్ అయింది.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
దారుణం.. పండుగరోజు ఇంటి ముందర కొడుకు చూస్తుండగానే తండ్రిపై అఘాయిత్యం

అయితే ఈ ఒక్క కేసే కాదు.చాలా కేసుల్లోనూ ఇలాంటివి జరిగాయి.

Advertisement

డ్రగ్స్ లేదా గంజాయిని ఎలుకలు తినేశాయంటూ కోర్టుకు పోలీసులు చెప్పారు.ఇప్పుడు మళ్లీ అలాంటి కేసు మరోకటి చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు