ఆ విషయంలో రష్మికకు పూజా హెగ్డే ఝలక్..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న రష్మిక, పూజా హెగ్డేల మధ్య గట్టి పోటీ ఉందనే సంగతి తెలిసిందే.

రెమ్యునరేషన్ విషయంలో పూజా హెగ్డే పై చేయి సాధిస్తున్నా సక్సెస్ రేట్ పరంగా మాత్రం రష్మికనే పైచేయి సాధిస్తున్నారు.

అయితే ఒక విషయంలో మాత్రం పూజా హెగ్డే రష్మికకు భారీ షాక్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న రష్మిక, పూజా హెగ్డే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పోటీ పడుతున్నారు.

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో రష్మిక దూసుకుపోతున్నారు.ప్రస్తుతం పుష్ప సినిమాలో ఈ హీరోయిన్ కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

అయితే గ్లామర్ విషయంలో పూజా హెగ్డేతో పోలిస్తే రష్మిక వెనుకబడిందనే కామెంట్లు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి.పూజా హెగ్డే ఒకవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో నటిస్తూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ లో కూడా నటించారు.

Advertisement

కానీ రష్మిక మాత్రం గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూ అభినయ ప్రధాన పాత్రలతోనే సత్తా చాటుతున్నారు.దీంతో గ్లామర్ పరంగా పూజా హెగ్డేనే టాప్ అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతుండగా గ్లామర్ షో చేయకపోయినా రష్మికకు ఆఫర్లు తగ్గడం లేదని రష్మిక గ్లామర్ షో చేస్తే పూజా హెగ్డేను మించి క్రేజ్ సాధిస్తుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు తెలుగులో రిలీజ్ కావాల్సి ఉండగా రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.ఈ సినిమా సక్సెస్ ను బట్టి టాలీవుడ్ లో రష్మిక, పూజా హెగ్డేలలో ఎవరికి క్రేజ్ ఎక్కువో తేలే అవకాశం ఉంది.

బాలీవుడ్ లో కూడా ఈ ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు