తెలుగు స్టార్ హీరోయిన్స్ ఒకప్పుడు బాలీవుడ్ కు వెళ్లడం అంటే చాలా గొప్ప విషయం.ఇక బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో నటించడం అంటే కూడా అదో మహాద్బుతంగా చెప్పుకునే వారు.
కాని సినిమాల మద్య హద్దులు చెరిగి పోయాయి.బాలీవుడ్ లో సినిమా చేస్తున్నా కూడా పెద్దగా టాలీవుడ్ కంటే క్రేజ్ ఏమీ ఉండదు.
మన తెలుగు సినిమాల కంటే వారు తోపు సినిమాలను ఏమీ తీయరులే అని చాలా మంది అనుకుంటున్నారు.ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరోయిన్స్ చాలా మంది ఏరి కోరి మరీ పారితోషికం తగ్గించుకుని మరీ ఇక్కడ నటించేందుకు సిద్దం అవుతున్నారు.
టాలీవుడ్ రేంజ్ అంత పెరిగినా కూడా కొందరు మాత్రం ఇంకా బాలీవుడ్ వైపు తిరిగి చూడటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.
బాలీవుడ్ లో అవకాశాల కోసం కొందరు హీరోయిన్స్ ఎప్పుడు ఎదురు చూస్తున్నారు.
సరే టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేని వారు బాలీవుడ్ లో ప్రయత్నాలు చేయడం ఓకే.కాని టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉండటంతో పాటు రెండు కోట్లకు మించి పారితోషికం ఇస్తున్నా కూడా పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నాలు బాలీవుడ్ వైపు చూడటం దారుణం అంటున్నారు.బాలీవుడ్ లో అంతకు మించి పారితోషికాలు ఇవ్వడం లేదు.అయినా కూడా వారు అక్కడకు వెళ్లడం ఏంటో అంటున్నారు.కొందరు ఈ విషయంలో వారిద్దరిని తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో నెం.1 గా ఉన్న వారు వేరే భాషను చూడటం ఎందుకు.అలాంటి వారిని మనం ఎందుకు ప్రోత్సహించాలంటూ తెలుగు మీడియా వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ పేరు తెచ్చుకుని అక్కడకు ఎగిరి పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదని అభిమానులు కూడా అంటున్నారు.