Rashmi soumya rao : కొత్త యాంకర్ ఎంట్రీపై స్పందించిన యాంకర్ రష్మీ.. మళ్లీ నేనే వస్తానంటూ?

జబర్దస్త్ షోకు అనసూయ గుడ్ బై చెప్పిన తర్వాత ఆమె స్థానంలోకి వచ్చే యాంకర్ ఈమేనంటూ మంజూష, దీపికా పిల్లి, వర్షిణితో పాటు పలువురి పేర్లు వినిపించాయి.

అయితే ఎవరూ ఊహించని విధంగా అనసూయ స్థానంలోకి రష్మీ ఎంట్రీ ఇచ్చారు.

గత కొన్ని వారాలుగా రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో పాటు జబర్దస్త్ షోకు కూడా యాంకర్ గా వ్యవహరించడంతో అందరూ షాకయ్యారు.రష్మీనే జబర్దస్త్ షోకు పర్మనెంట్ యాంకర్ అని భావించారు.

అయితే రష్మీ స్థానంలో జబర్దస్త్ షోలో సౌమ్యా రావు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.సౌమ్య ఎంట్రీతో జబర్దస్త్ షోకు పూర్వ వైభవం రావడం ఖాయమని కామెంట్లు వినిపించాయి.

అయితే సౌమ్య ఎంట్రీ గురించి రష్మీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జబర్దస్త్ కు కొత్త యాంకర్ వస్తుందని నాకు ముందే తెలుసని రష్మీ అన్నారు.

Advertisement

జబర్దస్త్ షోకు రీఎంట్రీ ఇచ్చే సమయంలో ఇన్ స్టాగ్రామ్ లో నేను పోస్ట్ కూడా పెట్టానని రష్మీ పేర్కొన్నారు.

అనసూయ వెళ్లిపోయిన తర్వాత కొత్త యాంకర్ వచ్చేవరకు జబర్దస్త్ కు చేయాలని అడిగారని రష్మీ అన్నారు.అనసూయ వేరే షూట్స్ కు వెళ్లిన సమయంలో నేను హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయని రష్మీ తెలిపారు.బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో రెమ్యునరేషన్ లేకుండా చేశానని రష్మీ అన్నారు.

బొమ్మ బ్లాక్ బస్టర్ లో ఎక్కువమంది కొత్తవాళ్లకు ఛాన్స్ ఇచ్చామని రష్మీ పేర్కొన్నారు.ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశం ఇవ్వాలని రష్మీ అన్నారు.

బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.రష్మీకి కొత్త సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

రష్మీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు