అలనాటి స్టార్ హీరోయిన్ భానుమతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమె ముక్కు సూటితనం, ఆత్మవిశ్వాసం, నిండైన కట్టు, బొట్టు ఆమె వ్యక్తిత్వాన్ని మరో మెట్టు పైకెక్కిచ్చాయి.
కానీ అవే ఆమెకు రావాల్సినంత పేరు తీసుకురాలేదంటారు అప్పటి తరం వారు.మరీ ముక్కు సూటిగా ఉంటే సినిమా పరిశ్రమకు సరిపోరు అంటూ ఉంటారు.
వాస్తవంగా కూడా జరిగింది అదే కానీ ఆమెను దగ్గరగా చూసిన వారు మాత్రం ఆమె లాంటి వ్యక్తిత్వం ఎవరికీ ఉండదు అని, ఆమె ఎంతో మంచివారని చెప్తూ ఉంటారు.అలాంటి వారిలో నిర్మాత విబీ రాజేంద్రప్రసాద్ గారు కూడా ఉన్నారు.
ఆయన నిర్మాతగా భానుమతి హీరోయిన్ గా అంతస్తులు అనే ఒక సినిమాని నిర్మించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక అరుదైన సంఘటన జరిగింది భానుమతి గారు వేళ్ళు ఎలుకలు కొరికాయి.
అప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత మీరే జరిగింది ఇక తెల్లవారితే ఒక పాట షూటింగ్ చేయాలి.దులపర బుల్లోడా అంటూ సాగే ఆ పాట షూట్ కోసం అంత సిద్ధమైంది.
అయితే ఆమెను తీసుకురావడానికి వెళ్లిన అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ తిరిగి సినిమా షూటింగ్ లోకేషన్ కి వచ్చాడు.భానుమతి గారి వేళ్ళను చుంచులు కొరికేసాయి అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు నిర్మాత.

పరుగున వెళ్లి భానుమతి గారిని చూసేసరికి ఆమె వేళ్ళకు మందు రాసుకుంటూ కనిపించారు.జరిగిన పొరపాటుకు ఆయన క్షమాపణ కూడా చెప్పాడు.అంతేకాదు ఈరోజు షూటింగ్ ఆపేద్దాం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంటూ నిర్మాత చెప్పడంతో భానుమతి గారు అందుకు నిరాకరించారు.నా వేళ్ళకు ఏదో జరిగినంత మాత్రాన షూటింగ్ ఆపిస్తానా ? అలా ఆపితే నేను భానుమతిని ఎలా అవుతాను మందు రాసుకున్నాను పరవాలేదు వెళ్లి షూటింగ్ చేద్దాం అంటూ చెప్పగానే నిర్మాత అలా శిలా విగ్రహం ల నిలబడిపోయాడు.ఈ అరుదైన సంఘటన గురించి నిర్మాత ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.







