తెలంగాణ ఏర్పాటైన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మరణాలు సంభవించడం ఇదే తొలిసారని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.ఈ ప్రక్రియ ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారని తెలిపారు.
ఇబ్రహీంపట్నలో ఆపరేషన్లు చేసిన డాక్టర్ చాలా అనుభవశాలన్న ఆయన.ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశామని వెల్లడించారు.
మరణాలకు గల కారణాలు తెలుసుకునేందుకు నలుగురికి పోస్టుమార్టం నిర్వహించామన్నారు.మిగతా 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు.అనంతరం మృతుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో, డబుల్ బెడ్ రూం ఇల్లుతో పాటు వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.అదేవిధంగా ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.







