మహాత్మాగాంధీకి ఆ దేశంలో అరుదైన గౌరవం...

మహాత్మాగాంధీ జీవితం ఒక భారతీయులకే కాకుండా విదేశాలలో ఉన్న వారికి కూడా మహాత్మా గాంధీ ఆదర్శం.

అహింస అనే ఆయుధంతో భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన విధానం కొన్ని కోట్ల మందికి ఆయన దగ్గరయ్యాడు.

అందుకే ఇప్పటికే విదేశాలలో కూడా మహాత్మాగాంధీ విగ్రహాలు ఉంటాయంటే అయన ఖ్యాతి ఎన్ని కోట్ల మందికి విస్తరించిందో మనకు అర్థమవుతోంది.అయితే మహాత్మాగాంధీకి మరో అరుదైన ఘనత దక్కింది.

ఒక్కొక్కరు ఒక్కో విధంగా గాంధీపై తమ అభిమానాన్ని చాటిన గాంధీ అభిమానులు ఇక కెనడాలోని హోటల్ డి గ్లేస్ అనే హోటల్ లో గాంధీ మంచు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.మొత్తం తొమ్మిది మంచుగడ్డలతో ఈ విగ్రహాన్ని తయారు చేసానని, గాంధీ విగ్రహాన్ని తయారుచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ శిల్పి మార్క్ లిపైర్ తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.మహాత్మాగాంధీ గౌరవం రోజురోజుకు పెరుగుతుండడం తమ కెంతో గర్వకారణమైన విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఏది ఏమైనా ఇది గాంధీకి దక్కిన గౌరవం అని కాకుండా భారత దేశానికి దక్కిన గౌరవంగా చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే త్వరలో గాంధీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్న తరుణంలో గాంధీకి మేము ఇస్తున్న చిరు గౌరవంగా భావిస్తున్నామని హోటల్ యజమానులు తెలిపారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు