బాలీవుడ్ లో గత కొంత కాలంగా బయోపిక్స్ హవా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది.ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.
ఇక ఇప్పుడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా ఆడియెన్స్ ను మెప్పించేందుకు సిద్ధమవుతోంది.యంగ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా కనిపించనున్నారు.
అయితే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రణ్ వీర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది.83 అని టైటిల్ సెట్ చేసిన ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మొత్తానికి రణ్ వీర్ కపిల్ గెటప్ లో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు.1983లో ఇండియాకు మొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ ఫైనల్ మ్యాచ్ లో ఏ విధంగా ప్రణాళికలు రచించారు అనే అంశాలను సినిమాలో ప్రధానంగా చూపించనున్నారట.

లార్డ్స్ మైదానంలోనే క్లయిమ్యాక్స్ కి సంబంధించిన షూటింగ్ నిర్వహించడానికి చిత్ర యూనిట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది.2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా అదే గ్రౌండ్ లో జరగనుంది.మ్యాచ్ ముగిసిన అనంతరం దర్శకుడు కబీర్ ఖాన్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.