అలియా భట్ రణబీర్ కపూర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే రణబీర్ కపూర్( Ranbir Kapoor) తాజా సినిమా యానిమల్ ట్రైలర్( Animal Trailer ) లాంచ్ ఈవెంట్ ని చాలా ఘనంగా చేశారు.
ఇక ఈ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) తో పాటు బాబి డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ లు పాల్గొన్నారు.ఇక ఈ ఈవెంట్లో రణబీర్ కపూర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.
ఈ మూవీలో ఉండే తన పాత్రతో నాకు డిటాచ్ ఉంటాను.ఇది మనం ప్రేమించే వారిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

కానీ ఇంటికి వెళ్ళాక నేను ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం నా భార్య నన్ను కొడుతుంది అంటూ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ఫన్నీగా మాట్లాడారు.ప్రస్తుతం రణబీర్ కపూర్ అలియా భట్( Alia Bhatt ) నన్ను కొడుతుంది అంటూ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ విషయం తెలిసిన చాలామంది నవ్వుకుంటున్నారు.

ఇక యానిమల్ సినిమా (Animal Movie) మూడు గంటల 21 నిమిషాల డ్యూరేషన్ ఉంటుందని స్వయంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి( Director Sandeep Reddy ) చెప్పడంతో అందరూ ఈ సినిమా ప్లాఫ్ అవుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు.ఎందుకంటే ఎక్కువ నిడివితో ఉన్న సినిమాలు కచ్చితంగా ప్లాఫె అని భావిస్తారు.కానీ యానిమల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.







