Animal Movie: సౌత్ ఇండియాలో కపూర్ నటులకు ఇలాంటి ఒకరోజు వస్తుంది అని ఊహించి ఉండరు

ఆనిమల్.( Animal Movie ) ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో అతిపెద్ద చిత్రం గా అవతరించబోతుంది.

సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్స్ నటించిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నారు.ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ దాటుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ కి ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు.ఎందుకంటే తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో అరుదైన ఇలాంటి ఒక సినిమా తీయడం చాలా పెద్ద విషయం.

పైగా ఈ చిత్రానికి రైటర్, డైరెక్టర్, ఎడిటర్ అన్ని సందీప్ రెడ్డి కావడం విశేషం.

Advertisement

అయితే బాలీవుడ్ అనగానే అందరికీ గుర్తచ్చేది ఖాన్ లు( Khan ) మరియు కపూర్ లు( Kapoor ) మాత్రమే.చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ వారి చేతుల్లోనే ఉంది.ఇప్పటికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఖాన్ సినిమా లేదంటే కపూర్ సినిమా చూడాల్సిన పరిస్థితి బాలీవుడ్ లో నెలకొని ఉంది.

ఇక ఆనిమల్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో ముగ్గురు కపూర్ లో ఉన్నారు.అందులో ఒకరు ఈ సినిమాలో హీరోగా నటించిన రణబీర్ కపూర్( Ranbir Kapoor ) కాగా మరొకరు హీరోకి తండ్రి పాత్రలో నటించిన అనిల్ కపూర్( Anil Kapoor ) అలాగే నెగటివ్ పాత్రలో నటించిన శక్తి కపూర్.

( Shakti Kapoor ) ఇలా ఈ ముగ్గురు కపూర్ లు కలిసి నటించిన ఈ సినిమా ప్రస్తుతం అందరికీ మంచి పేరునైతే తీసుకొస్తుంది కానీ వీరందరికీ మించి రష్మిక కు సైతం ఈ చిత్రం చాలా హైట్ క్రియేట్ చేసిందని చెప్పాలి.

భారీ తారాగణం అలాగే పెద్ద నటీనటులు ఉన్న ఈ సినిమాలో రష్మిక( Rashmika ) పాత్ర నిజంగానే చాలా గొప్పగా ఉంటుంది.దాంతో వీళ్ళందర్నీ రష్మిక డామినేట్ చేసింది.అలా కపూర్ లు అందర్నీ పక్కన పెట్టి ఈ సినిమాకి ఆమె హైలైట్ గా నిలవడం అంటే వారి పరువును గంగతో కలపడమే అని ఒక వర్గం వారు భావిస్తున్నారు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

పైగా ఈ సినిమా కోసం ఎవరు కూడా సౌత్ ఇండియా లో కపూర్ సినిమా కోసం రావడం లేదు.కేవలం మన తెలుగోడు డైరెక్ట్ చేసిన సినిమాగానే గుర్తించి థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.

Advertisement

ఇలాంటి ఒక రోజు వస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండరు.ఎందుకంటే సినిమా అంటే కపూర్ సినిమా అని వారికి వారు ఊహించుకుంటూ ఉంటారు.

తాజా వార్తలు