రానా అనారోగ్యంపై ఉన్నపుకార్లన్నింటికి సమంత షో సమాధానం

హీరో రానా ఆరోగ్యం బాగాలేదు అనే విషయం అందరికి తెల్సిందే.కాని క్లారిటీ లేక పోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకునేవారు.

ఇటీవల రానా ఆపరేషన్‌ చేయించుకున వచ్చాడు.ఆయన అమెరికాలో గత ఏడాది దాదాపుగా ఆరు నెలల పాటు ఉన్న విషయం తెల్సిందే.

భారీ ఎత్తున ఈయన ఆరోగ్యం విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.నిజమే నాకు అనారోగ్య సమస్య ఉంది.

చిన్నప్పటి నుండి నాకు బీపీ సమస్యగా ఉంది.దాంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

Advertisement

ఆ కారణంగానే నాకు గత ఏడాది ఆపరేషన్‌ జరిగింది.ఆ ఆపరేషన్‌ సమయంలో నేను బతకడం సగం వరకే ఛాన్స్‌ ఉంది అంటూ వైధ్యులు చెప్పారు.

ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో బీపీ ఎక్కువ అయితే కష్టం అవుతుంది అంటూ వైధ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.కాని ఆపరేషన్‌కు వెళ్లక తప్పనిపరిస్థితి.

కనుక ఆపరేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందని రానా అన్నాడు.సమంత ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న సామ్‌ జామ్‌ షో కోసం రానా ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెల్సిందే.

ఆ ఇంటర్వ్యూలో సమంత పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను రానా నుండి రాబట్టింది.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల నుండి ఆరోగ్య విషయాల వరకు అన్నింటిని కూడా రాబట్టింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

రానా ఆరోగ్య సమస్య గురించి మాట్లాడిన సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకున్నారు.రానా కూడా కన్నీరు పెట్టుకోవడంతో సమంత ఎమోషనల్‌ అయ్యింది.

Advertisement

రానా అనారోగ్యంపై ఇప్పటి వరకు ఉన్న పుకార్లన్ని కూడా తొలగిపోయినట్లే.ఆహాలో రానా సామ్‌ జామ్‌ షో ఈనెల 27వ తారీకున స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది.

రానాతో పాటు నాగ్‌ అశ్విన్‌ కూడా పాల్గొన్నాడు.వీరిద్దరితో సమంత చేసిన సందడి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

పూర్తి ఎపిసోడ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు