భార్య చేత చెంపదెబ్బ తిన్న రామ్‌ గోపాల్‌ వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ ఏ విషయంను అయినా నిర్మొహమాటంగా, ధైర్యంగా అనేస్తాడు.ఆయన మొండిగా ఏ విషయంపై అయినా ముందుకు వెళ్లగల ధైర్యం ఉన్న వ్యక్తి.

అలాంటి వ్యక్తికి భార్య, కుటుంబం, పిల్లలు అంటే అసలు బాధ్యత ఉండదు.పెళ్లి అనే బంధాన్ని తాను నమ్మను అంటాడు.

పెళ్లి వల్ల సమస్యలు మొదలవుతాయంటూ తాజాగా మరో ఇంటర్వ్యూలో రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పుకొచ్చాడు.ఆ ఇంటర్వ్యూలో తన భార్య గురించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు.

నా భార్యకు నేను శ్రీదేవికి ఫ్యాన్‌ను అనే విషయం ముందే తెలుసు.అయితే అప్పుడు ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు.కాని నేను ఎప్పుడైతే శ్రీదేవితో సినిమాలు చేసి క్లోజ్‌ అయ్యానో అప్పుడు నా భార్యకు అనుమానం రావడం మొదలైంది.

Advertisement

ఇది అభిమానించడం వరకే ఉంటుందా మరెక్కడికైనా దారి తీస్తుందా అంటూ ఆమె అనుమానపడేది.పదే పదే నా ముందు శ్రీదేవితో అక్రమ సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తూ మాట్లాడేది.

ఒకరోజు రాత్రి సమయంలో శ్రీదేవి మా ఇంటికి కాల్‌ చేసింది.ఆ సమయంలో నేను ఇంట్లో లేకపోవడంతో నా భార్య ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడింది.

నేను ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీదేవి ఫోన్‌ చేసిన విషయాన్ని చెప్పి మెల్లగా గొడవ స్టార్ట్‌ చేసింది.శ్రీదేవితో అక్రమ సంబంధం వరకు తీసుకు వెళ్లింది.

అప్పుడే నేను నేను ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నాతో గొడవ పడి శారీరకంగా ఆమెతో కలవకుండా చేయగలవేమో, అదే నీలో ఆమెను చూసుకుంటూ నీతో ఉంటే అప్పుడేం చేస్తావనగానే నా చెంపపై ఒక్కటి కొట్టింది.ఆమెకు నేను మాట్లాడిన మాటలు నచ్చలేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

నేను అన్నది నిజం అయినా ఆమె స్వీకరించి ఒక్క నిమిషం ఆలోచించలేక పోయిందని వర్మ చెప్పుకొచ్చాడు.మా ఇద్దరి మద్య పెద్దగా సంతోషాలు ఏమీ లేవని వర్మ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు