మరొక యాక్షన్ డైరెక్టర్ కు చెప్పిన ఓకే రామ్ పోతినేని !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఎప్పుడు చాకోలెట్ బాయ్ లాగా ఉండే రామ్ ఈ సినిమాతో ఒక్కసారిగా తన లుక్ మార్చేశాడు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరిన్ని యాక్షన్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు.వీటి మీదనే రామ్ తన ఫోకస్ అంతా పెట్టినట్టు తెలుస్తుంది.

రామ్ ఈ మధ్యనే రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా మళ్ళీ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేక పోయింది.

కానీ రామ్ కు మాస్ హీరోగా మంచి పేరు అయితే వచ్చింది.ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా కమిటయ్యారు.

Advertisement

పక్కా మాస్ సినిమాలను తెరకెక్కించే లింగుస్వామి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

లింగుస్వామి తో సినిమా ప్రకటించడంతో ఒక్కసారిగా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లోను బాగా అంచనాలు పెరిగాయి.మాస్ సినిమాలను తెరకెక్కించే లింగుస్వామి రామ్ పోతినేని ని ఎలా చూపిస్తాడో అని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రామ్ మరొక యాక్షన్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

యాక్షన్ సినిమాలను తెరకెక్కించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.రామ్ కోసం బోయపాటి ఒక పవర్ ఫుల్ మాస్ మసాలా స్టోరీ రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

లింగుస్వామి సినిమా తర్వాత రామ్ చేయబోయే సినిమా ఇదేనని చెబుతున్నారు.ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు