కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ.. వివేక్ వుడ్ అంటూ ట్వీట్!

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ నెల 11వ తేదీ ఒక చిన్న సినిమాగా విడుదల అయి బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న "ది కశ్మీర్ ఫైల్స్" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దేశ వ్యాప్తంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అంటూ చెప్పుకొస్తున్నారు.

అనుపమ్ ఖేర్, పల్లవిజోషి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో 1990 లో కశ్మీర్ పండిట్లు పడిన కష్టాలను ఎంతో అద్భుతంగా చూపించారు.ఒక చిన్న సినిమాగా విడుదలయి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా పై తాజాగా కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.వివేక్ రంజన్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఎంతో ధైర్యంగా తెరకెక్కించారు.

ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ పరిశ్రమను పక్కకు తోసి కొత్తరకం ఫిలిం మేకర్స్ ను సృష్టించే విధంగా బాలీవుడ్ ను కాస్తా వివేక్ వుడ్ గా మార్చారు అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

ఈ సినిమా కమర్షియల్ గా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడం కన్నా కొత్తరకం ఫిలిం మేకర్స్ ని తీసుకురావడం అనేది గొప్ప విషయం అంటూ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై ట్వీట్ చేయడమే కాకుండా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పై ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈ సినిమా గురించి వరుస ట్వీట్లు చేస్తూ వర్మ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు