గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య టికెట్ల వ్యవహారం పెద్ద రచ్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు స్పందిస్తే మరి కొందరు మౌనం వహించారు.
ఇలా కొందరు మౌనం పాటించడంతో సినిమా సమస్యలను పట్టించుకోని దిక్కు లేదా అంటూ కొందరు ప్రశ్నించడంతో ఈ వ్యవహారంపై సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేశారు.ఈ క్రమంలోనే పలు డిబేట్లో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వానికి తనదైన శైలిలో ప్రశ్నలు కురిపించారు.
ఈ సందర్భంగా ఆయన మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ రాజమౌళి 50 కోట్లతో సినిమా తీశారు.వర్మ ఐదు లక్షలతో ఒక సినిమా చేశారు.
ఈ రెండిటికీ ఒకటే మార్కెట్ అంటే ఎలా.ఇవన్నీ ఎవరికోసం అంటే పేద వారి కోసమేనని ప్రభుత్వం సమాధానం చెబుతోంది.టికెట్ రేట్లు ఇలాగే ఉంటే మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ యాదవ్, సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిసి రాజమౌళి కన్నా అద్భుతంగా సినిమా తీసి ఫ్రీగా విడుదల చేయమని వారికి సవాల్ విసిరాడు.మీకు ఆ కెపాసిటీ లేకపోతే ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలని వర్మ ఈ సందర్భంగా టికెట్ల విషయంపై స్పందించారు.

ఇక మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తారా? అని మాట్లాడారు ఈ విషయంపై కూడా వర్మ స్పందించారు…నేను వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేశాను అయితే ప్రస్తుతం వైసిపి పరిపాలన నాకు నచ్చలేదు మీరు ఆ పదవి నుంచి దిగి పోమ్మని చెబితే దిగిపోతారా.అంటూ నాని ప్రశ్నకు కౌంటర్ వేశారు.ఐదు నిమిషాలలో పరిష్కారం అయ్యే ఈ సమస్యను ఇలా ఎందుకు సాగిస్తున్నారో అర్థం కాలేదు అంటూ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.