అమ్మాయి టీషర్ట్ పై ఆర్జీవీ కొంటె వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన సినిమాల కంటే వివాదాల ద్వారానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు విడుదలవుతున్నా ఆ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

ఒక అమ్మాయి టీషర్ట్ పై 2019 సంవత్సరంలో నెగిటివ్ పీపుల్ ను దూరం పెట్టామని 2020 సంవత్సరంలో పాజిటివ్ పీపుల్ ను దూరం పెట్టామని 2021 సంవత్సరంలో మనుషులనే దూరం పెడుతున్నామని ఉంది.ఆ అమ్మాయి టీషర్ట్ గురించి ఆర్జీవీ స్పందిస్తూ 2022 సంవత్సరంలో అసలు మనుషులే ఉండకపోవచ్చంటూ కొంటె వ్యాఖ్యలు చేశారు.

వర్మ చేసిన ఈ పోస్ట్ గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు నెటిజన్లు మాత్రం కరోనా కేసులు ఇదే స్థాయిలో నమోదైతే రాబోయే రోజుల్లో మనుషులే ఉండకపోవచ్చని వర్మ చెప్పింది నిజమే కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

వర్మ డైరెక్షన్ చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా ఆయన పెట్టిన పోస్టులకు మాత్రం ఆదరణ ఎక్కువగా ఉంటుంది.కొన్ని రోజుల క్రితం ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన "ఆర్జీవీ దెయ్యం" సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

Advertisement

ఈ మధ్య కాలంలో వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలు ఆయన స్థాయికి తగిన సినిమాలు కాదని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వర్మ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎప్పుడు వస్తారో చూడాల్సి ఉంది.

ఒకప్పుడు ఆర్జీవీ డైరెక్షన్ లో నటించాలని స్టార్ హీరోలు భావించగా ప్రస్తుతం హీరోలెవరూ ఆర్జీవీ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు.ఆర్జీవీ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఆఫీసర్ సినిమా ఘోర పరాజయం పాలవడంతో నాగార్జున కూడా రామ్ గోపాల్ వర్మకు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు