Ram charan Jr ntr : ఎన్టీఆర్ లో ఉన్న ఆ క్వాలిటీ నాలో లేనందుకు నేను సిగ్గుపడుతున్నాను : రామ్ చరణ్

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే.

ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులకు తెలిసిపోయింది.ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ చనువుగా సరదాగా ఉండడంతో వీరిద్దరి మధ్య అంత మంచి అనుబంధంగా ఉందా అని ఇద్దరు హీరోల అభిమానులు ముక్కున వేలేసుకున్నారు.

Ram Charans Shocking Comments On Jr Ntr

ఇకపోతే వీరిద్దరికి ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో పాపులారిటీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు ఉన్నంత చనువుగా క్లోజ్ గా మరే హీరోలు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్( Ram charan ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ని యాంకర్ ఈ విధంగా ప్రశ్నించింది.ఎన్టీఆర్ నుండి మీరు మీలో ఆ క్వాలిటీ ఉంటే బాగుండేది అని దేనిని చూస్తే అనిపిస్తుంది అని యాంకర్ అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ఎన్టీఆర్( Jr ntr ) లో అంతులేని ఎనర్జీ ఉంది.

Advertisement
Ram Charans Shocking Comments On Jr Ntr-Ram Charan Jr Ntr : ఎన్టీఆ

అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ అర్థం కాదు.అంత ఎనర్జీ అయితే నాలో లేదు, అవకాశం వస్తే ఎన్టీఆర్ నుండి ఆ ఎనర్జీని నేను అప్పుగా తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

Ram Charans Shocking Comments On Jr Ntr

అయితే రామ్ చరణ్ ఇచ్చిన ఈ సమాధానం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.ఆయన అభిమానులు మాత్రం దీనిని ఏకీభవించలేదు.అయితే ప్రస్తుతం ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు.

దీంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఎవరికి వారు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ గేమ్ చేంజర్( Game Changer ) సినిమాలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు