ఉపాసన బిడ్డ కోసం కానుకగా ఊయల... ఎవరు పంపించారు తెలుసా.... వైరల్ అవుతున్న ఫోటో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)ఉపాసన (Upasana) మరి కొద్ది రోజులలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.

ఇలా పెళ్లి తర్వాత దాదాపు 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబంలో సంతోషం నెలకొంది మరి కొద్ది రోజులలో మెగా వారసులు రాబోతున్న నేపథ్యంలో ఆ రోజు కోసం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం గర్భిణిగా ఉన్నటువంటి ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీకి సంబంధించి ఏ చిన్న విషయం చెప్పిన క్షణాలలో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక ఊయలను(Cradel) తనకు కానుకగా పంపించారని చెప్పుకొచ్చారు.అయితే ఆ ఊయలను ఎవరు పంపించారు అనే విషయాలను కూడా ఉపాసన తెలియజేశారు.

తమకు పుట్టబోయే బిడ్డకు ప్రజ్వలా ఫౌండేషన్ (Prajwala Foundation) ఊయలను కానుకగా పంపించారని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు.ఈ ప్రజ్వలా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్నటువంటి మహిళలను రక్షించి వారికి ఈ ఫౌండేషన్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు.

Advertisement

ఇలా ఈ ఫౌండేషన్ అలాంటి మహిళలకు ఉపాధితో పాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నారు.దీంతో ఈ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మహిళలు ఉపాసన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఈ ఊయలను తయారు చేసి కానుకగా పంపించారని తెలిపారు.ఇక ఆ మహిళలు తయారు చేసిన ఈ ఊయల అపారమైన ప్రాముఖ్యతను సంతరించుకొని ఉందని ఈమె తెలియజేశారు.

ఈ ఊయలలో ఆ మహిళలోని ధైర్యం, బలం, ఆత్మగౌరవం, ఆశకు ప్రతీకగా తన బిడ్డకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.తన బిడ్డ పుట్టినప్పటినుంచి ఇలాంటి విషయాలకు బహిర్గతం కావాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ విధంగా తన బిడ్డ కోసం కోయలను కానుకగా పంపినందుకు ప్రజ్వలా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ కు ఈమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు