మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’.ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్ట పడుతున్నాడు.
తన గత సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత ఇదే విజయాన్ని కంటిన్యూ చేయడానికి చరణ్ శతవిధాలా కృషి చేస్తున్నాడు.అందుకే ఎక్కడ తగ్గకుండా తన 15వ సినిమాను పూర్తి చేస్తున్నాడు.
ముందు నుండి ఈ సినిమాలో చరణ్ విభిన్న లుక్ లలో కనిపిస్తాడు అనే టాక్ వస్తూనే ఉంది.ఇదే టాక్ ను నిజం చేస్తూ చరణ్ పలు గెటప్ లలో కనిపిస్తున్నాడు.
మరి తాజాగా చరణ్ మరో న్యూ లుక్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.చరణ్ హెయిర్ స్టైలిష్ట్ అలీం హకీం చరణ్ ను అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రెజెంట్ చేస్తూ సరికొత్తగా లుక్ ని మార్చాడు.
ఈ లుక్ ను సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

అయితే చరణ్ ఈ లుక్ తోనే నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ కానున్నట్టు తెలుస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ లుక్ ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో రివీల్ అవుతుంది అని చరణ్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ అదిరిపోతుందని టాక్.చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో గ్రామీణ యువకుడిగా ఒక పాత్ర అయితే అల్ట్రా స్టైలిష్ లుక్ లో మరో పాత్ర అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సునీల్, అంజలి వంటి స్టార్స్ కూడా ఇందులో భాగం అయ్యారు.ఇక ఈ సినిమాను మార్చి నెలలోపే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.