ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది.ఇందులో భాగంగా హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాలను మరొకసారి థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ అయ్యింది.కాగా ఇప్పటికే జల్సా, ఖుషి, ఒక్కడు, మురారి, ఆది, త్రీ లాంటి సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే రీ రిలీజ్ లో విడుదల అయ్యే సినిమాలు ఇప్పటికే టీవీలలో,మైబైల్ లో చాలా సార్లు చూసిన సినిమాలే,అయినప్పటికీ రీ రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ ని రాబడుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ నెల 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) పుట్టినరోజు సందర్భంగా మొదట మగధీర సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు రెండు వారాల క్రితం గీత ఆర్ట్స్ సంస్థ( Geetha Arts ) అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు ఇందులో చిన్న మార్పు జరిగింది.అదేమిటంటే మగధీర స్థానంలో ఆరంజ్ సినిమాను వేయబోతున్నారు.
నిజానికి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ తెచ్చిన సందర్భంలో రాజమౌళి ఎవర్ గ్రీన్ హిట్స్ ని వేయడం ఎంతైనా సముచితం.కానీ ఈలోపు ఏం జరిగిందో ఏమో కానీ జనసేన నిధుల సమీకరణ కోసం ఆరంజ్ వేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కలర్ ఫోటో నిర్మాత, బేబీ దర్శకుడు సాయి రాజేష్( Sai Rajesh ) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
గతంలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు సాయి రాజేష్.
కాగా అప్పట్లో విడుదల అయిన ఆరెంజ్ మూవీ( Orange Movie ) బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చిన తెచ్చింది.దీనివల్లే ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని నిర్మాత నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.అయితే మగధీర ప్రింట్ కు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వల్లే హఠాత్తుగా ఆరెంజ్ సినిమాని దింపుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.