రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబయిలో భారీ ఎత్తున జరిగింది.ముంబయిలో హిందీ వర్షన్ ట్రైలర్ విడుదల సందర్బంగా జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ కనిపించక పోవడం చర్చనీయాంశం అయ్యింది.
అసలు రామ్ చరణ్ ఎందుకు ముంబయి వెళ్లలేదు అనేది కొం
దరి టాక్.ముంబయి లో సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్.
ఆలియా.రాజమౌళి మరియు అజయ్ దేవగన్ ఇతర యూనిట్ సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఇద్దరు హీరోలు మీడియా సమావేశం కు వస్తారని ఎదురు చూసిన ముంబయి మీడియా వారికి నిరాశ తప్పలేదు.అసలు ఏం జరిగింది.
ఎందుకు ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ హాజరు కాలేదు అనేది కొందరిలో ఉన్న ప్రశ్న.ఆ ప్రశ్నకు పలువురు పలు రకాలుగా సమాధానాలు చెబుతున్నారు.
అందులో ప్రథానంగా రామ్ చరణ్ భార్య ఉపాసన సోదరి పెళ్లి జరిగింది.

ఆ సందర్బంగా పెళ్లి పనులతో బిజీగా ఉండటం వల్ల చరణ్ ముంబయి వెళ్ల లేకపోయాడు అనేది కొందరి మాట.ఆ విషయంలో నిజం ఉండే ఉంటుంది.మరి కొందరు మాత్రం రాజమౌళి తన ఇద్దరు హీరోలను ఒకే సారి మీడియా ముందు చూపించడం వల్ల హైప్ తగ్గుతుందని భావించాడేమో.
అందుకే సినిమా నుండి మెల్ల మెల్లగా హీరోల ను కలిపి చూపించాలని భావిస్తున్నాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అనుకుంటున్నారు.అసలు విషయం ఏంటీ అనే విషయం లో క్లారిటీ లేదు.
కాని ముంబయి ప్రెస్ మీట్ మాత్రం రామ్ చరణ్ ను మిస్ అయ్యాం.రామ్ చరణ్ ఆ ప్రెస్ మీట్ మిస్ అయినా నేడు జరుగబోతున్న చెన్నై మరియు బెంగళూరు ప్రెస్ మీట్ లకు చరణ్ హాజరు అవ్వబోతున్నట్లుగా మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది.